ట్రంప్ రాసలీలల సమాచారం ఇస్తానంటూ అమెరికా గూఢచారులకు టోకరా.. రూ. 65 లక్షలతో రష్యన్ పరారీ!
- హ్యాకింగ్ టూల్స్, అధ్యక్షుడి రాసలీలల సమాచారం ఇస్తానంటూ ప్రకటన
- తీసుకునేందుకు ముందుకొచ్చిన ఎన్ఐఏ ఏజెంట్లు
- రూ.6.5 కోట్లకు బేరం.. అడ్వాన్స్‌తో పరారీ
ఈ ప్రకటన చూసిన అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) ఏజెంట్లు అతడిని సంప్రదించారు. వాటిని తాము తీసుకుంటామని అతడితో బేరం కుదుర్చుకున్నారు. అయితే 6.5 కోట్లు ఇస్తేనే వాటిని విక్రయిస్తానని సదరు రష్యా వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో అడ్వాన్స్ కింద సీఐఏ ఏజెంట్లు రూ.65 లక్షలు అందించారు. ఆ సొమ్మును తీసుకున్న రష్యా వ్యక్తి ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఎన్ఎస్ఏ టూల్స్ కానీ, ట్రంప్ రాసలీలకు సంబంధించిన సమాచారం కానీ అతడు అందజేయలేదు. దీంతో ఇప్పుడతని కోసం అమెరికా గూఢచారులు గాలిస్తున్నారు.