ట్రంప్ కు మరో షాక్... రెండోసారి మూతబడ్డ అమెరికా ప్రభుత్వం!
- మూడు వారాల వ్యవధిలో మరో షట్ డౌన్
- ఆర్థిక బిల్లులకు ఆమోదం పలకని సెనెట్
- ప్రతినిధుల సభలోనూ అదే పరిస్థితి
- ప్రజల్లో తీవ్ర ఆందోళన
ఒక్క డాలర్ కూడా బయటకు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో సంక్షేమ పథకాలకు నిధులు లేని పరిస్థితి. నెనెట్ తో పాటు హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ కూడా కొత్త బిల్లుకు ఆమోదం తెలపాల్సి వుండటంతో తాజా సంక్షోభం ఎన్ని రోజులు కొనసాగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, జనవరిలో ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించకమూడు రోజుల పాటు ప్రభుత్వం స్తంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అత్యవసర అవసరాల నిమిత్తం ఓ తాత్కాలిక బిల్లును మూడు వారాల పాటు అమలులోకి తేగా, దాని కాలపరిమితి నిన్నటితో ముగిసింది.