ఎప్పుడూ భారత్ పై విరుచుకుపడే మియాందాద్ కూడా కోహ్లీని పొగిడేశాడు!
- ప్రపంచంలోనే కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్
- కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్స్ నాకు బాగా నచ్చుతాయి
- బౌలర్లను అప్పటికప్పుడే అంచనా వేయగలడు
కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్స్ తనకు బాగా నచ్చుతాయని చెప్పిన మియాందాద్... బౌలర్ల బలాలు, బలహీనతలను కోహ్లీ అప్పటికప్పుడే అంచనా వేయగలడని కితాబిచ్చాడు. ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మెన్ కోహ్లీ అని చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్ విధానమే అతనికి పరుగులు ధారాళంగా రావడానికి కారణమని అన్నాడు. మియాందాద్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో కోహ్లీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.