షూటింగ్ బిజీ వల్ల విచారణకు రాలేనన్న వర్మ... మరోసారి నోటీసులు ఇవ్వనున్న సీసీఎస్ పోలీసులు!
- నేడు సీసీఎస్ పోలీసుల ముందు హాజరు కావాల్సిన వర్మ
- ముంబైలో బిజీగా ఉన్నానంటూ లాయర్ ద్వారా సమాచారం పంపిన వర్మ
- వచ్చే వారం మళ్లీ నోటీసు ఇస్తే వస్తానన్న దర్శకుడు
అయితే, ముంబైలో షూటింగ్ లో బిజీగా ఉన్న వర్మ... ఈ నోటీసులను తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, షూటింగ్ బిజీ వల్ల విచారణకు హాజరు కాలేనంటూ తన లాయర్ ద్వారా సీసీఎస్ పోలీసులకు వర్మ సమాచారం ఇచ్చాడు. వచ్చే వారం మళ్లీ నోటీసులు ఇస్తే, విచారణకు హాజరవుతానని వర్మ తెలిపాడు. ఈ నేపథ్యంలో, వర్మకు మళ్లీ నోటీసులు ఇవ్వడానికి సీసీఎస్ పోలీసులు సిద్ధమయ్యారు. ఆ నోటీసుకు కూడా వర్మ రాకపోతే, అరెస్ట్ వారెంట్ జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నారని సమాచారం.