Donald Trump: ట్రంప్‌కు మరోసారి మెలానియా ఝలక్!

షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికైనా టూర్‌లకు తన సతీమణి మెలానియాని తీసుకెళ్లేటపుడు ఆమెకి చేయి అందిస్తుంటారు. గతంలో అలా ఆయన చేయి అందించినపుడు ఆ చేతిని అందుకోవడానికి ఆమె రెండుసార్లు నిరాకరించారు. తాజాగా మరోసారి అదే పరిస్థితి ఆయనకు ఎదురయింది. అది కూడా ఆయన ఇంటి ముందే కావడం గమనార్హం.

వారిద్దరూ సోమవారం ఒహియో బయలుదేరారు. ఆ సమయంలో విమానం ఎక్కేందుకు వైట్ హౌస్ నుంచి ఇద్దరూ కలిసి వస్తుండగా ట్రంప్ మెలానియా చేతిని పట్టుకుని నడిచేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె నిరాకరించారు. ఆమె పొడవాటి ఓవర్‌కోట్ ధరించడంతో మెలానియా చేయిని ట్రంప్ అందుకోలేకపోయారు. దాంతో వారిద్దరూ విడివిడిగానే నడుచుకుంటూ వెళ్లిపోయారు.

సంబంధిత వీడియోని ఎన్‌బిసి న్యూస్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. దాంతో నెటిజన్లు దానిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, గతేడాది మేలో ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా కూడా ట్రంప్‌కు ఇలాంటి అనుభవమే కలిగిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Donald Trump
Melania

More Telugu News