Tollywood: టైమ్ డిసైడ్ చేస్తే పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తా: వి.వి. వినాయక్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ నటించే సినిమాకు ఎప్పుడు దర్శకత్వం వహిస్తారనే ప్రశ్నకు దర్శకుడు వినాయక్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం ఎప్పుడు వహిస్తాననే విషయం తాను చెప్పలేనని, ఆ విషయాన్ని టైమ్ డిసైడ్ చేయాల్సిందేనని అన్నారు.

కాగా, సాయి ధరమ్ తేజ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇంటిలిజెంట్’. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నంబర్ 150’ తెరకెక్కిస్తున్నప్పుడే సాయిధరమ్ తో ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రతి హీరోలో ఒక ప్రత్యేకత ఉంటుందని, మనం ఎంచుకున్న కథకు తగ్గట్టుగా హీరో ఎంపిక ఉంటుందని, ప్రతి హీరో కష్టపడే పని చేస్తారని అన్నారు.
Go Back to Shorts
Tollywood
VV Vinayak

More Telugu News