గంగూలీ రికార్డును బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో కోహ్లీ!
- విదేశీ గడ్డపై కెప్టెన్ గా 11 వన్టే సెంచరీలు
- గంగూలీ రికార్డు సమం
- మరో సెంచరీ చేస్తే రికార్డు బద్దలు
నిన్నటి సెంచరీతో కోహ్లీ వన్డే సెంచరీల సంఖ్య 33కు చేరుకుంది. ఇందులో 20 సెంచరీలు ఛేజింగ్ లో చేసినవి కావడం గమనార్హం. ఆ 20 సెంచరీలు టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చడం విశేషం. కెరీర్ మొత్తమ్మీద విదేశీ గడ్డపై కోహ్లీ 15 సెంచరీలు చేశాడు. నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ 119 బంతుల్లో 112 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించాడు. దీంతో, ఆరు వన్డేల సిరీస్ లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.