Jagan: ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యత’ పేరిట వైసీపీ పోస్టర్

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర  నేటికి 75వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రెండో రోజు జగన్ తన పాదయాత్రను కొనసాగించారు. సైదాపూర్ శివారు నుంచి ఈ రోజు ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. సిద్దలయ్యకోన, ఊటుకూరు మీదుగా తురిమెర్లకు ఆయన చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు.

 కాగా, ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యత’ పేరిట ఓ పోస్టర్ ను జగన్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ను జగన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చట్ట సభల్లో రాజకీయ ప్రాధాన్యం లభించని బీసీ సామాజిక వర్గాలు అనేకం ఉన్నాయి. వారందరికీ రాజకీయ ప్రాధాన్యత లభించినప్పుడే వారి సమస్యలు చట్టసభల్లో వినిపిస్తాయి. ఆ సామాజికవర్గం ఆర్థిక, సామాజిక పురోభివృద్ధిని సాధించగలుగుతుంది’ అని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు.

Go Back to Shorts
Jagan
YSRCP

More Telugu News