కొత్త రికార్డును సృష్టించిన 'దువ్వాడ జగన్నాథం'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త రికార్డును సృష్టించిన 'దువ్వాడ జగన్నాథం'

  • యూట్యూబ్ లో అల్లు అర్జున్ జోరు
  • 'సరైనోడు' హిందీ వెర్షన్ హవా 
  • ఆ వ్యూస్ ను క్రాస్ చేసిన 'దువ్వాడ జగన్నాథం'
అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'దువ్వాడ జగన్నాథం' .. క్రితం ఏడాది జూన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా హిందీ వెర్షన్ కి యూట్యూబ్ లో 71 రోజుల్లో 100 మిలియన్లకి పైగా వ్యూస్ లభించడం విశేషం.

గతంలో అల్లు అర్జున్ చేసిన 'సరైనోడు' సినిమా హిందీ అనువాదానికి యూట్యూబ్ మాధ్యమంలో 171 రోజుల్లో 100 మిలియన్లకి పైగా వ్యూస్ లభించాయి. 'దువ్వాడ జగన్నాథం' సినిమా కేవలం 71 రోజుల్లోనే 100 మిలియన్లకి పైగా వ్యూస్ ను రాబట్టడం కొత్త రికార్డు. ఈ సినిమాలతో .. ఈ రికార్డులతో అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైపోయాడని అంటున్నారు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' చేస్తోన్న అల్లు అర్జున్, ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.    
Allu Arjun
pooja hegde

More Telugu News