ram gopal varma: ఇక జీఎస్టీ-2.. మరో కలకలం రేపుతోన్న రామ్ గోపాల్ వర్మ

షార్ట్స్‌లో చూడండి
ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఎవరి మాటా విన‌కుండా త‌న‌దైన శైలిలో సినిమాలు తీస్తూ దూసుకుపోతోన్న వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌లే గాడ్, సెక్స్, ట్రూత్ పేరుతో శృంగార‌మే ప్ర‌ధానాశంగా ఓ సినిమా తీసిన విష‌యం తెలిసిందే. మ‌హిళా సంఘాల ఘాటు హెచ్చ‌రిక‌ల‌ను కూడా ప‌ట్టించుకోకుండా ఈ సినిమాను ఆన్ లైన్లో విడుద‌ల చేసిన వ‌ర్మ‌.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా జీఎస్టీ-2 తీస్తానని ప్రకటించి మరో కలకలం రేపారు.

పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ‘జీఎస్టీ’కి వస్తున్న అద్భుతమైన స్పందన చూశాక జీఎస్టీ- 2ని వెంటనే ప్రారంభించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఆ భగవంతుడు, తన జీఎస్టీ లవర్స్ తనకు మద్దతు తెలుపుతారని తాను నమ్ముతున్నానని ట్వీట్ చేశారు. 
Go Back to Shorts
ram gopal varma
gst
cinema

More Telugu News