సాయిపల్లవి తెగ ఇబ్బంది పెట్టేస్తోందట !
- సూర్య సరసన సాయిపల్లవి
- షూటింగుకి రావడంలో ఆలస్యం
- ఇబ్బందిపడిపోతోన్న యూనిట్
తన అభిమాన హీరో సరసన ఇంత త్వరగా ఛాన్స్ తగులుతుందని తాను కలలో కూడా అనుకోలేదని ఆ మధ్య సాయిపల్లవి చెప్పింది. అలాంటి సాయిపల్లవి ఈ సినిమా షూటింగుకి ఆలస్యంగా వస్తూ, అందరినీ ఇబ్బంది పెట్టేస్తోందట. షూటింగ్ స్పాట్ లోను ఆమె వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' షూటింగ్ సమయంలోను సాయిపల్లవిపై ఇలాంటి వార్తలే వచ్చాయి. ఇప్పుడు సూర్య సినిమాలోనూ అదే తంతు. ఆమెపై జరుగుతోన్న ఈ ప్రచారంలో నిజమెంతనేది సాయిపల్లవినే చెప్పాలి.