సూర్యతో విలన్ గా తలపడనున్న జగపతిబాబు?
- సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య
- మొదటి షెడ్యూల్ పూర్తి
- కథానాయికలుగా రకుల్ .. సాయి పల్లవి
రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే చెన్నై లో ఒక షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. రెండవ షెడ్యూల్ ను ఫిబ్రవరి రెండవ వారంలో మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ రోల్ పవర్ ఫుల్ గా ఉండటంతో జగపతిబాబును సంప్రదించారట. ఈ పాత్రను చేయడానికి ఆయన సుముఖతను వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.