Donald Trump: ట్రంప్ కు 200 ఏళ్లు జీవించే శక్తి వుందట.. వ్యక్తిగత వైద్యుడు చెబుతున్న జన్యు రహస్యం!

  • ట్రంప్ శరీరంలో అద్భుతమైన జన్యువులు
  • ఆయన మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉన్నారు
  • డైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ నివేదిక
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు 200 ఏళ్ల పాటు జీవించే అనుకూలతలు ఉన్నాయంటే నమ్మడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ మాత్రం ఇదే చెబుతున్నారు. ట్రంప్ శరీరంలో అద్భుతమైన జన్యువులు ఉన్నాయన్నది ఆయన నివేదిక. ట్రంప్ ఆహార మెనూనూ మెరుగ్గా మార్చి ఉంటే 200 ఏళ్లపాటు నిక్షేపంలా జీవించేందుకు అవకాశం ఉండేదని ఆయన ఆరోగ్యాన్ని విశ్లేషించారు.

ట్రంప్ అధ్యక్షుడయ్యాక మొదటిసారిగా జాక్సన్ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శారీరకంగా, మానసికంగా తన బాధ్యతల నిర్వహణకు ట్రంప్ ఫిట్ గా ఉన్నారని నిర్ధారించారు. మానసిక పరీక్షలో భాగంగా కాగ్నిటివ్ ను పరీక్షించగా 30కు 30 మార్కులు వచ్చాయి. అయితే, కొంత మేర మేధస్సు క్షీణత మొదలైందని తెలిసింది. దీన్నే అల్జీమర్స్ గానూ పేర్కొంటారు. అయితే, ట్రంప్ ఎంతో చురుకైన వారని, ఆయన ఆలోచనా శక్తి విషయంలోతనకెటువంటి సందేహం లేదని జాక్సన్ నివేదికలో పేర్కొన్నారు. ట్రంప్ కు కాగ్నిటివ్ టెస్ట్ చేసే ఆలోచేన తనకు లేదని, కాకపోతే ట్రంప్ కోరిన మీదటే చేసినట్టు చెప్పారు.
Donald Trump

More Telugu News