పద్మావత్ సినిమాను నా సినిమా బీట్ చేస్తోంది: రామ్ గోపాల్ వర్మ
- జీఎస్టీపై ఈ రోజు ఉదయం నుంచి ట్విట్టర్‌లో ట్వీట్లు
- దీపికా పదుకునేపై తన సినిమా హీరోయిన్ దండయాత్ర చేస్తోందంటోన్న వర్మ
- సర్వర్ క్రాష్ అయింది.. ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తా
తాజాగా, విడుదలైన దీపికా పదుకునే పద్మావతి సినిమాకి మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పద్మావతి సినిమాను తన సినిమా బీట్ చేస్తోందని వర్మ పేర్కొన్నారు. పద్మావత్ చిత్రం కన్నా తన జీఎస్టీ సినిమాపై ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. కాగా, జీఎస్టీ సినిమా ఇంకా విడుదల కాలేదు. సర్వర్ క్రాష్ అయిన కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతున్నందుకు తాను సారీ చెబుతున్నానని, ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయాన్ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చెబుతానని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.