ఆ వార్తల్లో నిజం లేదు.. అవి పుకార్లు మాత్రమే: హీరో ఆది

  • నాకు యాక్సిడెంట్ కాలేదు
  • నేను సేఫ్ గానే ఉన్నా
  • 'భాగమతి' సినిమాలో నటించడం లేదు
యంగ్ హీరో ఆది పినిశెట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని ఆది అన్నాడు. యాక్సిడెంట్ జరిగి, సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. తాను సేఫ్ గానే ఉన్నానని తెలిపాడు. సినిమా షూటింగ్ లు, స్క్రిప్ట్ వర్క్ లతో బిజీగా ఉన్నానని చెప్పాడు. తనపై ఇంత అభిమానం చూపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇదిలా ఉంచితే, 'భాగమతి' సినిమాలో తాను నటించినట్టు వార్తలు వచ్చాయని... అందులో తాను నటించ లేదని చెప్పాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
adi pinisetty
tollywood

More Telugu News