వర్మ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' మూవీపై కృష్ణంరాజు స్పందన
- వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి
- సినిమా చూడాలని ఆయన ఎవరినీ కోరడం లేదు
- చాలా మంది అలాంటి సినిమాలు చూస్తున్నారు
ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కటీ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ రోజుల్లో ఒక విషయం పిల్లలకు తెలియకుండా కూర్చోబెట్టడం కుదిరే పని కాదని చెప్పారు. మనలో చాలా మంది అలాంటి సినిమాలు చూస్తున్నవారు ఉన్నారని తెలిపారు. వర్మను విమర్శించాల్సిన అవసరం లేదని... జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు దర్శకుడిగా ఆయనను చూడాలని చెప్పారు.