ram gopal varma: రామ్‌ గోపాల్‌ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళలు

షార్ట్స్‌లో చూడండి
గాడ్‌, సెక్స్, ట్రూత్ (జీఎస్టీ) పేరిట శృంగారమే ప్రధానాంశంగా సినిమా తీస్తూ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో వివాదాన్ని రేపుతోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న తీరుపై మ‌హిళా సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. ఈ నేప‌థ్యంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌పై విజ‌య‌వాడలోని సూర్య‌రావుపేట పోలీస్ స్టేషన్‌లో బీజేపీ మహిళా మోర్చా నేత‌లు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... వ‌ర్మ‌ని ఆయ‌న భార్య‌, కూతురు వెలివేశారని అన్నారు.

వ‌ర్మ సినిమాలు వారం, పది రోజులు కూడా ఆడడం లేదని, ఏదో ఒక రకంగా నీచంగా ప‌బ్లిసిటీ చేసుకుని, డ‌బ్బులు సంపాదించే ఉద్దేశంతో ఇటువంటి సినిమాలు తీస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని అన్నారు. తనను విమర్శిస్తోన్న వారిపై కూడా వ‌ర్మ నీచంగా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు.  
Go Back to Shorts
ram gopal varma
Police
Vijayawada

More Telugu News