తొలిరాత్రిని కాళరాత్రి చేసిన శాడిస్ట్ రాజేష్ కు బెయిల్ లభించిన కారణమిదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలిరాత్రిని కాళరాత్రి చేసిన శాడిస్ట్ రాజేష్ కు బెయిల్ లభించిన కారణమిదే!

  • తొలిరాత్రి భర్త నపుంసకుడని ఫిర్యాదు చేసిన శైలజ
  • ఆమెను తీవ్రంగా హింసించిన రాజేష్
  • నపుంసకుడు కాదని నివేదిక ఇచ్చిన వైద్యులు
  • రాజేష్ తరఫు న్యాయవాది వాదనతో బెయిల్
దాదాపు రెండు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని రేపిన రాజేష్, శైలజల కేసులో రాజేష్ కు చిత్తూరు కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైద్య నివేదిక తరువాత రాజేష్ తరఫు న్యాయవాది చేసిన వాదనతో కొంత ఏకీభవించిన న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. వీరిద్దరికీ వివాహమైన తరువాత, శోభనం నాటి రాత్రి, గదిలో నుంచి బయటకు వచ్చిన శైలజ, తన భర్త నపుంసకుడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆపై గదిలోకి వెళ్లిన ఆమెను రాజేష్ దారుణంగా కొట్టాడు.

దీంతో ఈ కేసు కలకలాన్ని రేపగా, కోర్టు రాజేష్ కు లైంగిక పటుత్వ పరీక్షలు చేయాలని ఆదేశించింది. రాజేష్ కు ఆ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అతను నపుంసకుడు కాదని, అంగస్తంభన, వీర్య స్కలనం సాధారణంగానే ఉన్నాయని నివేదిక ఇచ్చారు. దీన్ని పోలీసులు కోర్టుకు అందించగా, తొలి రాత్రి ఉండే భయం, ఆత్రుత తన క్లయింటులో వున్నాయని, దాన్నే నపుంసకత్వంగా శైలజ చూపిందని, ఆ ఆగ్రహంతోనే తన క్లయింట్ దాడి చేశాడని రాజేష్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. శోభనం నాడే భర్తకు మగతనం లేదని భార్యే బయటకు వచ్చి ఆరోపిస్తే ఎలాగని ప్రశ్నించారు. అతనికి బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం తదుపరి పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది.
Rajesh
Sailaja
Bail
Chittore

More Telugu News