ram gopal varma: అందుకే, ఈ సినిమాకు గాడ్‌, సెక్స్‌, ట్రూత్ అని పేరు పెట్టాను: రామ్ గోపాల్ వ‌ర్మ‌

షార్ట్స్‌లో చూడండి
'గాడ్‌, సెక్స్‌, ట్రూత్' (జీఎస్టీ) పేరుతో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తోన్న సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. శృంగారమే ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా విషయంలోనే కాకుండా ఏ విషయంలోనూ తాను ఎవరికీ లొంగబోనని తాజాగా రామ్ గోపాల్‌ వర్మ అన్నారు. తాను సింహంలాంటి వాడిని కాదని, దాని కన్నా పవర్ ఫుల్ అని చురకలంటించారు. ఒక విషయంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని, వారందరి భావాలకు అనుగుణంగా తాను సినిమాలు తీయబోనని అన్నారు.

ఈ సినిమాకి గాడ్‌, సెక్స్‌, ట్రూత్ (జీఎస్టీ) అని పేరు పెట్టడానికి కారణం శృంగారాన్ని దేవుడే క్రియేట్ చేశాడని చెప్పడమేనని వర్మ చెప్పారు. గాడ్ క్రియేట్ చేసిన సెక్సుని తప్పని, స్త్రీలు ముడుచుకుని ఉండాలని ఇలా ఎన్నో భావాలను ప్రజలే సృష్టించారని అన్నారు. తాను బలంగా అనుకున్న విషయాన్నే సినిమాగా తీస్తానని అన్నారు.      
Go Back to Shorts
ram gopal varma
cinema
gst

More Telugu News