మా ఘోర ఓటమికి కారణమిదే: విరాట్ కోహ్లీ
- రెండో టెస్టులో వైఫల్యంపై కోహ్లీ స్పందన
- చక్కగా రాణించిన బౌలర్లు
- బ్యాట్స్ మెన్ వైఫల్యంతోనే ఓటమి
- ఫీల్డింగ్ లోపాలు కూడా కొంపముంచాయన్న కోహ్లీ
తొలి మ్యాచ్ లో చేసిన తప్పులే రెండో మ్యాచ్ లోనూ జరిగాయని, దీనిపై ఆటగాళ్లు ఎవరికి వారు తమను తాము ప్రశ్నించుకోవాలని అన్నాడు. ఈ తరహా ఆట ఆడేందుకు ఇక్కడికి వచ్చామని తానేమీ అనుకోవడం లేదని, కేవలం 60 నుంచి 70 పరుగుల భాగస్వామ్యాలతో టెస్టు మ్యాచ్ లో విజయం సాధ్యం కాదన్న విషయాన్ని ఆటగాళ్లు గుర్తెరగాలని అన్నాడు. భాగస్వామ్యాలను సెంచరీ దాటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.