బ్రాడ్ మన్ రికార్డును సమం చేసిన కోహ్లీ!
- టెస్టుల్లో కెప్టెన్ గా ఎనిమిది సార్లు 150 ప్లస్ స్కోర్
- సెంచూరియన్ లో సెంచరీ కొట్టిన తొలి విదేశీ కెప్టెన్
- దక్షిణాఫ్రికాలో రెండో శతకం
మొత్తం మీద టెస్టుల్లో 150 ప్లస్ స్కోరును తొమ్మిది సార్లు సాధించాడు కోహ్లీ. మరోవైపు ఇదే మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో సెంచరీ సాధించిన ఆసియా దేశాల రెండో కెప్టెన్ గా అవతరించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా సెంచరీ కొట్టాడు. ఓవరాల్ గా దక్షిణాఫ్రికాలో కోహ్లీకి ఇది రెండో టెస్ట్ సెంచరీ. ఇదే గడ్డపై సచిన్ టెస్టుల్లో ఐదు సెంచరీలు బాదాడు. సెంచూరియన్ లో టెస్ట్ సెంచరీ చేసిన తొలి విదేశీ కెప్టెన్ కోహ్లీనే.