గ్రహాల అనుకూలత కోసం మంత్రాలయంలో పూజలు చేయిస్తున్న రాజమౌళి?
- గ్రహాల ప్రసన్నం కోసం రాజమౌళి పూజలు
- ముగిసిన శుక్ర మహాదశ.. ఇప్పుడు మరో దశలోకి
- టాలీవుడ్లో హాట్ టాపిక్
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సినిమాల సమయంలో ఆయనకు శుక్రమహాదశ నడిచిందట. ఈ దశలో ఎవరున్నా పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతారు. అయితే ఇప్పుడా దశ పూర్తయి మరో దశలోకి రాజమౌళి అడుగుపెడుతున్నాడు. దీంతో గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయిస్తే బాగుంటుందని పండితులు చెప్పారట. దీనికి సరేనన్న దర్శక ధీరుడు మంత్రాలయంలో పూజలు చేయిస్తున్నాడని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.