namitha: ప్రతి అమ్మాయికీ ఉండే ఫీలింగ్స్ నాకూ వున్నాయి!: నమిత

షార్ట్స్‌లో చూడండి
సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలనే కోరిక తనకు బలంగా ఉండేదని సినీ నటి నమిత తెలిపింది. మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకునేదాన్నని చెప్పింది. ప్రతి అమ్మాయికీ ఉండే ఫీలింగ్స్ ఇవి అని తెలిపింది. వీర లాంటి మంచి భర్తను పొందడం తన అదృష్టమని... అతన్ని భర్తగా పొందే అవకాశం తనకు ఉందనిపించిందని చెప్పింది.

తాను ఇప్పటికే అమ్మనని... నా అన్న కూతురుకు తాను అమ్మనేనని... ఇంట్లో ఉన్న పెట్స్ కు కూడా మమ్మీనే అని తెలిపింది. అయితే, నవ మాసాలు మోసి, బిడ్డను కనడం మాత్రం మామూలు విషయం కాదని చెప్పింది. అందుకే, ఈ విషయంలో కొంచెం సమయం తీసుకోవాలనుకుంటున్నానని తెలిపింది.
Go Back to Shorts
namitha
tollywood

More Telugu News