మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్... వలసవాదులపై అవమానకర వ్యాఖ్యలు
Add ap7am to your home Screen

మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్... వలసవాదులపై అవమానకర వ్యాఖ్యలు

  • ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారు మనకెందుకు?
  • నార్వే తదితర దేశాల నుంచి ఆకర్షించాలి
  • చట్టసభ సభ్యులతో జరిగిన సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికాకు వలస వచ్చిన నిపుణులను అవమానించే రీతిలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ‘‘చెత్త దేశాల నుంచి వచ్చే వీళ్లందరూ (వలసవాదులు) మనకెందుకు?’’ అని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో నాలుగు గోడల మధ్య ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

వీసాల లాటరీని సగానికి పరిమితం చేయాలని, మిగిలిన మేర తగిన ప్రాతినిధ్యం లేని ఆఫ్రికా దేశాలకు కేటాయించాలంటూ లిండ్సే గ్రాహమ్ ఓ ప్రణాళికలను ట్రంప్ కు తెలియజేశారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ ‘‘హైతి, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారు మనకు ఎందుకు? నార్వే వంటి దేశాల నుంచి అమెరికా ఎక్కువ మందిని ఆకర్షించాలి’’ అని అన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఓ వ్యక్తి మీడియాకు ఉప్పందించడంతో విషయం వెలుగు చూసింది.
Donald Trump

More Telugu News