రహానేను పక్కన పెట్టి రోహిత్ ను తీసుకోవడానికి కారణమిదే: కోహ్లీ
- రోహిత్ మంచి ఫామ్ లో ఉన్నాడు
- రోహిత్ ఎంపిక సరైందే
- బుమ్రా, రోహిత్ ల ఎంపికపై డూప్లెసిస్ ఆశ్చర్యం
అయితే, తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని, ఈ నేపథ్యంలో అతన్ని ఎంపిక చేశామని చెప్పాడు. గత మూడు టెస్టుల్లో రోహిత్ అద్భుతంగా ఆడాడని తెలిపాడు. మరోవైపు, నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికా టూర్ లో రహానే అద్భుతంగా రాణించాడు. ఇండియా టీమ్ సెలెక్షన్ పై దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రోహిత్, బుమ్రాల ఎంపిక తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు.