ఆర్ బాల్కీ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, కంగ‌నా ర‌నౌత్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్ బాల్కీ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, కంగ‌నా ర‌నౌత్‌!

  • వికలాంగురాలిగా న‌టించ‌బోతున్న కంగ‌నా
  • ఆమెకు మెంటార్‌గా అమితాబ్‌
  • 2018 చివ‌ర్లోగా విడుద‌ల‌
త్వ‌రలో కంగ‌నా ర‌నౌత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టించ‌బోతోంది. 'ప్యాడ్ మ్యాన్' త‌ర్వాత ఆర్ బాల్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న చిత్రంలో వీరిద్ద‌రూ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించనున్నారు. ఇందులో కంగనా ర‌నౌత్ విక‌లాంగురాలి పాత్ర పోషిస్తుండ‌గా, ఆమెకు మెంటార్‌గా అమితాబ్ న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక చిత్ర షూటింగ్‌లో కంగ‌నా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇక బాల్కీ చిత్రంలో నటించడం కోసం కంగ‌నా కొంత హోం వ‌ర్క్ చేయాల్సి ఉంది. అందుకోసం ఆమె దాదాపు రెండు నెల‌ల స‌మ‌యం తీసుకోనుంద‌ట‌. మరోపక్క, ఎవ‌రెస్ట్ అధిరోహించిన విక‌లాంగురాలు అరుణిమ సిన్హా జీవిత‌క‌థ‌ ఆధారంగా రూపొందే చిత్రంలో కూడా కంగ‌నా న‌టించ‌బోతున్న‌ట్లు ఆమధ్య వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్ప‌ట్లో ఆ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కేలా క‌నిపించ‌క‌పోవ‌డంతో బాల్కీ సినిమా కోసం తీసుకునే శిక్ష‌ణ ఆ సినిమాకు కూడా ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఏదేమైనా, 2017లో స్తబ్ధుగా సాగిన కంగ‌నా కెరీర్, 2018లో పుంజుకునే అవకాశాలు బాగానే క‌నిపిస్తున్నాయి.
balki
amitabh bachchan
kangana ranaut

More Telugu News