మళ్లీ ట్విట్టర్ ను మోతెక్కించనున్న రామ్ గోపాల్ వర్మ.. నెటిజన్ల సరదా కామెంట్లు
Add ap7am to your home Screen

మళ్లీ ట్విట్టర్ ను మోతెక్కించనున్న రామ్ గోపాల్ వర్మ.. నెటిజన్ల సరదా కామెంట్లు

  • ట్విట్టర్ అకౌంటును మళ్లీ యాక్టివేట్ చేసిన వర్మ
  • జీసస్ లా.. ట్విట్టర్ లో ఇది నా రెండో రాక
  • భారీగా స్పందిస్తున్న నెటిజన్లు
కొంత కాలం క్రితం వరకు వర్మ ట్వీట్లతో ట్విట్టర్ మోతెక్కిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని కారణాల వల్ల తన ట్విట్టర్ అకౌంట్ ను వర్మ ఆపేశారు. తాజాగా కొత్త సంవత్సరంలో ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ను మళ్లీ యాక్టివేట్ చేశారు. 'ఏసుక్రీస్తు పునరుత్థానంలా ... ట్విట్టర్ లో ఇది నా రెండో రాక. కొత్త సంవత్సర శుభాకాంక్షలు', అంటూ ట్వీట్ చేశాడు. వర్మ ట్విట్టర్ పునరాగమనంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొన్ని సరదా ట్వీట్లు ఇవే...

  • ట్విట్టర్ బాస్ ఈజ్ రెడీ.. గెట్ రెడీ మెగా ఫ్యాన్స్
  • మిస్డ్ యూ సో మచ్ సర్
  • సినిమా రిలీజ్ టైమ్ కి వచ్చావ్... అర్థమయింది
  • హాయ్ బ్రో... వెల్ కమ్ బ్యాక్
  • ఇన్ని రోజుల నుంచి మీరు లేక ట్విట్టర్ బోర్ కొడుతోంది
  • ఛీ ఛీ... దరిద్రం మళ్లీ వచ్చింది
  • నాకు కరెక్ట్ గా ఎగ్జామ్స్ ఉన్నప్పుడే యాక్టివేట్ అవుతావు
RGV
ram gopal varma
rgv twitter

More Telugu News