చదువుకునే రోజుల్లోనే నేను ఫ్రెండ్స్ తో చెప్పాను .. అదే నిజమైంది: కీర్తి సురేశ్
- సూర్య ఫాదర్ తో మా అమ్మ నటించింది
- సూర్యతో నేను నటిస్తానని ఫ్రెండ్స్ తో అనేదానిని
- సూర్య మనసు చాలా సున్నితం
- ఆయన అనవసరంగా మాట్లాడరు
నేను సినిమాల్లోకి రావడానికి ముందు నుంచి సూర్య అభిమానిని. సూర్య ఫాదర్ శివకుమార్ తో కలిసి మా అమ్మగారు కొన్ని సినిమాల్లో నటించారు. ఏదో ఒక రోజున నేను సూర్యతో తప్పకుండా నటిస్తానని అప్పట్లో నా ఫ్రెండ్స్ తో అంటూ వుండే దానిని. అది ఇప్పుడు నిజం కావడం నాకు ఆశ్చర్యాన్ని .. ఆనందాన్ని కలిగిస్తోంది. సూర్యతో నటించడం వలన, ఆయనది చాలా సున్నితమైన మనసనీ .. అనవసరంగా మాట్లాడరనే విషయం అర్థమైంది" అని చెప్పుకొచ్చింది.