Rajinikanth: రాజకీయాల్లోకి రానున్న రజనీకాంత్ ను ప్రశంసిస్తూ..పవన్ కల్యాణ్ కు సూచనలిస్తూ వర్మ ట్వీట్!

షార్ట్స్‌లో చూడండి
రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్ ను ప్రశంసిస్తూ, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు సూచనలిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశారు. ‘రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడమనేది ఈ శతాబ్దపు అద్భుతం. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన సమయంలో..స్క్రీన్ పై కనిపించే సూపర్ స్టార్ కన్నా వెయ్యిరెట్లు ప్రభావితమైన శక్తిగా ఆయన కనిపించారు. తమిళనాడులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పిన ‘తలైవా’ రజనీకాంత్ ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పీకే (పవన్ కల్యాణ్) స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని.. ఆ విధంగా చేస్తే సీట్లన్నీ పీకేవే’ అంటూ వర్మ తన మార్క్ ట్వీట్ చేశారు.

Go Back to Shorts
Rajinikanth
Pawan Kalyan
ram gopal varma

More Telugu News