Andhra Pradesh: కోడి పందాలను అడ్డుకోవాలని చూస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే శివరామరాజు

షార్ట్స్‌లో చూడండి
కోడిపందాలను అడ్డుకోవాలని చూసే వారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించమని పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే శివరామరాజు హెచ్చరించారు. జిల్లాలో సంప్రదాయకంగా నిర్వహించే కోడి పందాలకు మద్దతుగా వెంపలో సభ నిర్వహించారు. ఈ సభకు కొందరు ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ, కోడి పందాలను అడ్డుకోవాలని చూసే వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సభకు హాజరైన భీమవరం ఎమ్మెల్యే ఆంజనేయులు మాట్లాడుతూ, ఎవరు అడ్డొచ్చినా కోడిపందాలను ఆపే ప్రసక్తే లేదని, అవసరమైతే ఉద్యమానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
west godavari

More Telugu News