trivikram: అందుకే 'అజ్ఞాతవాసి'లో సునీల్ చేయలేదట!

షార్ట్స్‌లో చూడండి
కమెడియన్ గా సునీల్ ఎదగడంలో రైటర్ గా .. దర్శకుడిగా త్రివిక్రమ్ పాత్ర ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సినిమాల్లోకి రాక ముందు నుంచే ఇద్దరూ మంచి స్నేహితులు .. ఒకే రూములో వుండేవాళ్లు. ఈ మధ్య కాలంలో హీరోగా సునీల్ కు సక్సెస్ లు రాకపోవడంతో, మళ్లీ పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా కనిపించడానికి ఆయన రెడీ అవుతున్నాడు.

అలా కమెడియన్ గా 'అజ్ఞాతవాసి' ద్వారా సునీల్ ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి త్రివిక్రమ్ గట్టిగానే ప్రయత్నించాడట. సునీల్ కోసం ఒక ట్రాక్ ను సిద్ధం చేశాడు. కథా చర్చల్లో సునీల్ కూడా పాల్గొన్నాడని తెలుస్తోంది. అయితే ఆ ట్రాక్ సంతృప్తికరంగా రాకపోవడంతో పక్కన పెట్టేస్తున్నట్టు త్రివిక్రమ్ చెప్పాడట. 'నెక్స్ట్ ప్రాజెక్టులో చేస్తానులే' అంటూ సునీల్ తన సినిమాలపై ఫోకస్ పెట్టాడని అంటున్నారు. లేదంటే కమెడియన్ గా 'అజ్ఞాతవాసి' సినిమా నుంచే సునీల్ ఆడియన్స్ ముందుకు వచ్చేవాడిని చెప్పుకుంటున్నారు.      
Go Back to Shorts
trivikram
sunil

More Telugu News