మిస్ట‌ర్ ఇండియా 2017... ల‌క్నోకి చెందిన జితేశ్ సింగ్ దేవ్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిస్ట‌ర్ ఇండియా 2017... ల‌క్నోకి చెందిన జితేశ్ సింగ్ దేవ్‌!

  • మిస్ట‌ర్ ఇండియా సూప్ర‌నేష‌న‌ల్‌గా ప్ర‌త‌మేశ్ మౌలింక‌ర్
  • మొద‌టి ర‌న్న‌రప్ అభి ఖాజురియా
  • విజేత‌ల‌కు బ‌హుమ‌తులిచ్చిన న‌టి కంగ‌నా ర‌నౌత్‌
ముంబైలో బాంద్రా ఫోర్ట్ మిస్ట‌ర్ ఇండియా 2017 పోటీలు జ‌రిగాయి. పీట‌ర్ ఇంగ్లండ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ పోటీల్లో మిస్ట‌ర్ ఇండియా 2017గా ల‌క్నోకి చెందిన జితేశ్ సింగ్ దేవ్ నిలిచారు. దీంతో మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్ 2020 పోటీల్లో జితేశ్ సింగ్ దేవ్ పాల్గొనే అవ‌కాశం క‌లిగింది. అలాగే మిస్ట‌ర్ ఇండియా సూప్ర‌నేష‌న‌ల్‌గా ప్ర‌త‌మేశ్ మౌలింక‌ర్ నిలిచారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సూప్ర‌నేష‌న‌ల్ 2018 పోటీల్లో ప్ర‌త‌మేశ్ పాల్గొన‌నున్నారు. ఈ పోటీల్లో అభి ఖాజురియా, ప‌వ‌న్ రావ్‌లు మొద‌టి, రెండో ర‌న్న‌ర‌ప్‌లుగా నిలిచారు. 17 మంది పురుషులు పాల్గొన్న ఈ పోటీ విజేత‌లకు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ బ‌హుమ‌తులు అంద‌జేసింది. గ‌తేడాది జ‌రిగిన మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్ పోటీల్లో భార‌త దేశానికి చెందిన రోహిత్ ఖండేల్ వాలా విజేతగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.
mr. india
lucknow
jitesh singh deo
kangana ranaut

More Telugu News