ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిర్లక్ష్యం... డీఎస్పీ మరణాన్ని రికార్డు చేయని డీజీపీ కార్యాలయం
- చనిపోయిన డీఎస్పీని పోలీసు హెడ్‌క్వార్టర్స కు రావాలని ఆదేశం
- ఉదంతాన్ని బయటపెట్టిన మీడియా
- గుమాస్తా తప్పిదమని వివరణ ఇచ్చిన డీజీపీ కార్యాలయం
చనిపోయిన అధికారి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎలా రిపోర్ట్ చేస్తారంటూ పలువురు ఈ ఉత్తర్వులను చూసి నవ్వుకుంటున్నారు. ఓ డీఎస్పీ స్థాయి అధికారి చనిపోయినా దానిని రికార్డ్ చేయకుండా డీజీపీ కార్యాలయం ఈ రకంగా ఉత్తర్వులు జారీ చేయడం పోలీసు శాఖ పనితీరుకు అద్దం పడుతోందని జనాలు విమర్శిస్తున్నారు. అయితే జరిగిన తప్పు మీడియాకు తెలియడంతో వెంటనే డీజీపీ కార్యాలయం నుంచి గుమాస్తా తప్పిదం కారణంగా ఈ తప్పు జరిగిందని వివరణ వెలువడింది.