పోలీసులు చెప్పిన మాట విని షాక్ తిన్న రాజేష్... కాసేపట్లో అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసులు చెప్పిన మాట విని షాక్ తిన్న రాజేష్... కాసేపట్లో అరెస్ట్!

  • స్వాతితో కలిసి సుధాకర్ ను హత్య చేసిన రాజేష్
  • వారం రోజులుగా ఆసుపత్రి బెడ్ పై
  • ఇప్పటికే స్వాతి అరెస్ట్
తన ప్రియుడు రాజేష్ తో కలసి భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన స్వాతి, ప్రస్తుతం తమ అదుపులోనే ఉందని, జరిగినదంతా తమకు తెలిసిపోయిందని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ కు పోలీసులు విషయం చెప్పారు. పోలీసుల నోటి వెంట విషయాన్ని విన్న రాజేష్ షాక్ కు గురైనట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన్ను అరెస్ట్ చేసి, నాగర్ కర్నూలుకు తరలించనున్నారు.

ఈ కేసులో గత పది రోజులుగా ఆసుపత్రి బెడ్ పై ఉన్న రాజేష్ కు, గత రెండు రోజులుగా జరిగిన ఘటనలేవీ తెలియదు. స్వాతి రెండు రోజుల క్రితం అరెస్టుకాగా, నేడు రాజేష్ ను అరెస్ట్ చేసేందుకు ఉదయం నుంచి పోలీసులు ఆసుపత్రి ముందు మకాం వేశారు. వైద్యుల నుంచి క్లియరెన్స్ వచ్చిందని, అరెస్ట్ చేసి తీసుకెళతామని అన్నారు.
swathi
rajesh
acid attack
murder
nagarkurnool

More Telugu News