రాజేష్ అంగీకరిస్తేనే పుంసత్వ పరీక్షలు చేయండి!: పోలీసులకు స్పష్టం చేసిన చిత్తూరు కోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజేష్ అంగీకరిస్తేనే పుంసత్వ పరీక్షలు చేయండి!: పోలీసులకు స్పష్టం చేసిన చిత్తూరు కోర్టు

  • తొలిరాత్రి తనలోని రాక్షసుడిని చూపిన రాజేష్
  • భార్యను తీవ్రంగా హింసించి జైలుకు
  • పుంసత్వ పరీక్షలకు షరతులు విధించిన న్యాయస్థానం
తన లైంగిక లోపాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పేసిందన్న ఆగ్రహంతో తొలిరాత్రి భార్య శైలజను చిత్రహింసలు పెట్టిన రాజేష్ కు పుంసత్వ పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతో కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులకు షరతులతో కూడిన అనుమతి లభించింది. రాజేష్ అంగీరిస్తే మాత్రమే పోటెన్సీ టెస్టు చేసేందుకు చిత్తూరు కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి నుంచి పోటెన్సీ టెస్ట్ నోటీసులు తీసుకున్న పోలీసులు చిత్తూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజేష్ కు వాటిని అందించారు. దీనిపై లిఖితపూర్వక అభిప్రాయం చెప్పాలని ఆదేశించారు.

కాగా, రాజేష్ ఒప్పుకుంటేనే ఈ పరీక్షలు చేయిస్తామని వెల్లడించిన పోలీసులు, అంగీకరించకుంటే, మరిన్ని సెక్షన్లు జోడించి కేసును బలంగా చేస్తామని తెలిపారు. కాగా, ప్రస్తుతం రాజేష్ పై హత్యాయత్నం, గృహహింస, మోసం, కట్నం తీసుకోవడం, వంచన తదితర సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Rajesh
Sailaja
Potency Test

More Telugu News