తెలంగాణ డీజీపీకి యూఎస్ సీక్రెట్ సర్వీస్ లెటర్!
- ఇవాంక పర్యటనను విజయవంతం చేశారు
- పగలు, రాత్రి తేడా లేకుండా తెలంగాణ పోలీసుల కృషి
- మరోసారి పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాం
- అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ హెడ్ రిచర్డ్ లేఖ
తనిఖీల పేరిట అతిథులను ఇబ్బంది పెట్టే అవసరం లేకుండా చూడటం తమకు నచ్చిందని, అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని కితాబిచ్చారు. ఒకేరోజు రెండు కార్యక్రమాలు జరిగిన వేళ, తెలంగాణ పోలీసుల తీరు అద్భుతమని కొనియాడారు. పర్యటన షెడ్యూలు ఆసాంతం రహస్యంగా ఉంచి, చివరి క్షణాల్లో వివరాలు చెబుతున్నా, పోలీసులు సంయమనంతో అర్థం చేసుకుని విధులు నిర్వహించారని, మరోసారి తెలంగాణ పోలీసులతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తుంటామని తెలిపారు.