చంద్రబాబు చెప్పేవి అసత్యాలు.. హైదరాబాద్ మెట్రోరైల్ ఘనత మాదే!: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
- ప్రపంచంలో ఏ మంచి జరిగినా తానే చేశానని చంద్రబాబు అంటారు
- చెడు జరిగితే మాత్రం ప్రతిపక్షాల పనేనని అంటారు
- హైదరాబాద్‌పై చంద్రబాబుకు మమకారం పోలేదు
ప్రపంచంలో ఏ మంచి జరిగినా తానే చేశానని, చెడు జరిగితే మాత్రం ప్రతిపక్షాల పనేనని అనడం చంద్రబాబు నాయుడికి అలవాటుగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చినప్పటికీ చంద్రబాబుకు ఆ నగరంపై మమకారం పోలేదని రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు మణిహారంగా నిలుస్తోన్న మెట్రోరైలు ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లే వచ్చిందని అందరికీ తెలుసని తెలిపారు.