paris hilton: '11 ఏళ్ల క్రితం సెల్ఫీని కనిపెట్టింది మేమే'నంటూ బ్రిట్నీతో దిగిన సెల్ఫీని పోస్టు చేసిన పారిస్ హిల్టన్

షార్ట్స్‌లో చూడండి
సెల్ఫీ ట్రెండ్ గురించి అందరికీ తెలిసిందే. దైనందిన జీవితంలో సెల్ఫీ ఒక భాగమైపోయింది. అయితే ఈ సెల్ఫీని ఎవరు కనిపెట్టారు? అన్న ప్రశ్నకు సమాధానాన్ని సూపర్ మోడల్ పారిస్ హిల్టన్ చెప్పింది. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ తో కలిసి తాను సెల్ఫీని కనిపెట్టానని చెబూతూ ట్వీట్ చేసింది. ఈ మేరకు వారిద్దరూ దిగిన సెల్ఫీని ట్వీట్ చేసింది. ఇది వారి అభిమానులను అలరిస్తోంది.

దీంతో ఇది లైకులు, షేర్లతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, మరిన్ని ఫోటోలు పోస్టు చేస్తున్న నెటిజన్లు.. మీకంటే ముందే చాలా మంది సెల్ఫీలు దిగారని పేర్కొంటున్నారు.  
Go Back to Shorts
paris hilton
britny spiars
selfie

More Telugu News