తండ్రితో మాట్లాడుతూ కూర్చున్న రామ్‌చ‌ర‌ణ్‌ ఫొటోను పోస్ట్ చేసిన ఉపాస‌న‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రితో మాట్లాడుతూ కూర్చున్న రామ్‌చ‌ర‌ణ్‌ ఫొటోను పోస్ట్ చేసిన ఉపాస‌న‌!

  • మ‌న స‌మ‌యాన్ని త‌ల్లిదండ్రుల‌తో గ‌డ‌ప‌డం చాలా ముఖ్యం అంటోన్న ఉపాస‌న‌
  • గ‌డ్డంతో కొత్త లుక్‌తో అల‌రిస్తోన్న చిరు, చెర్రీ
  • ప్ర‌స్తుతం చిరు 'సైరా'.. చ‌ర‌ణ్ 'రంగస్థ‌లం' సినిమాలతో బిజీ 
సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న శ్రీవారు రామ్ చ‌ర‌ణ్ తేజ్‌కు సంబంధించిన విశేషాల‌ను చెబుతూ ఉండే ఉపాస‌న తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటో అంద‌రినీ అల‌రిస్తోంది. ఈ ఫొటోలో రామ్‌చ‌ర‌ణ్‌ తేజ్ త‌న తండ్రి చిరంజీవితో దీర్ఘంగా చ‌ర్చిస్తూ కూర్చున్నాడు. తండ్రీకొడుకులిద్ద‌రికీ గ‌డ్డం ఉంది. మ‌న స‌మ‌యాన్ని త‌ల్లిదండ్రుల‌తో గ‌డ‌ప‌డం చాలా ముఖ్యం అని, ఇది వారికి ఇచ్చే వెల‌గ‌ట్ట‌లేని బ‌హుమ‌తి అని పేర్కొంటూ, ఉపాస‌న ఈ ఫొటోని పోస్ట్ చేసింది.  

కాగా, ప్ర‌స్తుతం చిరంజీవి.. స్వాతంత్ర్య‌ సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా సెట్స్ పైకి వెళ్లనున్న 'సైరా' సినిమా కోసం గ‌డ్డం పెంచుతోన్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్‌ త‌న  'రంగస్థలం 1985' సినిమా కోసం గ‌డ్డం పెంచాడు.  
Chiranjeevi
Ramcharan
upasana

More Telugu News