Revanth Reddy: య‌శోద ఆసుప‌త్రికి వెళ్లి జానారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఐదు రోజుల‌ క్రితం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌ హైద‌రాబాద్ సోమాజిగూడ‌లోని య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. జానారెడ్డి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు స‌మాచారం. ఈ రోజు య‌శోద ఆసుప‌త్రికి వెళ్లిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. జానారెడ్డిని ప‌రామ‌ర్శించి, ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. జానారెడ్డి ఆసుప‌త్రిలో కోలుకున్నట్లు సమాచారం.  
Go Back to Shorts
Revanth Reddy
Jana Reddy
Congress

More Telugu News