raghu veera reddy: ఛ‌లో అసెంబ్లీని అడ్డుకోవ‌డం అమానుషం: ర‌ఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ప్ర‌త్యేక హోదా కోసం ఛ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఉద్య‌మకారుల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అమానుషంగా ప్ర‌వ‌ర్తించింద‌ని ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లోని ఇందిరాభ‌వ‌న్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ర‌ఘువీరారెడ్డి మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో అప్ప‌ట్లో ప్ర‌త్యేక హోదాపై రెండుసార్లు తీర్మానాలు చేశార‌ని, వాటిని గుర్తు చేసేందుకు తాము వెళుతోంటే కాంగ్రెస్‌, వామ‌ప‌క్ష నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌లను అదుపులోకి తీసుకోవ‌డ‌మే కాకుండా విజ‌య‌వాడ నుంచి తెలంగాణ ప్రాంతం వ‌ర‌కు వివిధ ర‌హ‌దారుల్లో రాత్రంతా తిప్పార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హోదా విష‌యంలో బీజేపీ-టీడీపీలు ఏపీకి ద్రోహం చేశాయ‌ని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
raghu veera reddy
Congress
BJP

More Telugu News