2 లక్షలు తీసుకుని ఉద్యోగం చూపని గల్ఫ్ ఏజెంట్ పై కత్తితో బాధితుడి దాడి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2 లక్షలు తీసుకుని ఉద్యోగం చూపని గల్ఫ్ ఏజెంట్ పై కత్తితో బాధితుడి దాడి!

  • 2 లక్షల రూపాయలు తీసుకుని గల్ఫ్ కు పంపిన ఏజెంట్ 
  • అప్పు చేసి తిరిగి భారత్ చేరి, ఫరూఖ్ ను నిలదీసిన విశ్వ
  • పోలీసులతో కొట్టిస్తానని హెచ్చరించడంతో ఫరూఖ్ పై దాడి చేసిన బాధితుడు  
2 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్ పై బాధితుడు కత్తితో దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన విశ్వ అనే నిరుద్యోగి విదేశాలకు వెళ్లేందుకు ఫరూఖ్ అనే ఏజెంట్ ను ఆశ్రయించాడు. దీంతో మంచి ఉద్యోగం, మంచి జీతం ఉందని చెప్పిన ఫరూఖ్ 2 లక్షల రూపాయలు తీసుకుని గల్ఫ్ పంపాడు. గల్ఫ్ వెళ్లిన తరువాత విశ్వకు చెప్పిన ఉద్యోగం ఇవ్వలేదు.

దీంతో విశ్వ అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. ఆశలు అడియాసలు కావడంతో అక్కడ తెలిసిన వారి నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేశాడు. అనంతరం ఫరూఖ్ ను ప్రశ్నించాడు. తన డబ్బులు తనకు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే మరోసారి డబ్బులు అడగడానికి వస్తే పోలీసులతో కొట్టిస్తానని ఫరూఖ్ సమాధానం చెప్పడంతో విశ్వ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఫరూఖ్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన గాయపడ్డాడు. 
gulf job
attack on agent
viswa
faruq

More Telugu News