c/o surya: హీరోయిన్ మెహ్రీన్ కు క్షమాపణలు చెప్పిన దర్శకుడు సుశీంద్రన్!

షార్ట్స్‌లో చూడండి
సందీప్ కిషన్, మెహ్రీన్ జంటగా సుశీంద్రన్‌ దర్శకత్వంలో నటించిన ‘నెంజిల్‌ తునివిరుందాల్‌’ (తెలుగులో కేరాఫ్ సూర్య) సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమా బాగున్నప్పటికీ నిడివి పెద్దగా ఉందని, నిడివి తగ్గిస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయి. దీంతో కొన్ని సీన్లకు కత్తెరవేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. వెంటనే రంగంలోకి దిగిన దర్శకుడు సుశీంద్రన్ సినిమా నిడివి తగ్గించారు.

అందులో భాగంగా మెహ్రీన్‌ నటించిన చాలా సన్నివేశాలను తీసేశారు. సుమారు 20 సన్నివేశాలను ఎడిట్ చేశారు. అంతే కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలను కూడా మార్చినట్టు ఆయన తెలిపారు. దీంతో 15 నిమిషాల నిడివి తగ్గిందని తెలుస్తోంది. ఈ సన్నివేశాలను సుమారు 15 రోజులు పాటు చిత్రీకరించామని.. దీనిపై ఆమెకు క్షమాపణలు చెబుతున్నామని సుశీంద్రన్ తెలిపారు.
Go Back to Shorts
c/o surya
movie
mehreen pirzada
siseendran

More Telugu News