టీటీడీపీకి మ‌రో షాక్‌.. రేపు కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లోకి కీల‌క నేత గండ్ర స‌త్య‌నారాయ‌ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీటీడీపీకి మ‌రో షాక్‌.. రేపు కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లోకి కీల‌క నేత గండ్ర స‌త్య‌నారాయ‌ణ

  • రేవంత్‌ రెడ్డి గుడ్ బై చెప్పిన త‌రువాత టీటీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు
  • జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి గండ్ర స‌త్య‌నారాయ‌ణ రాజీనామా
  • చంద్ర‌బాబుకి అందిన‌ రాజీనామా లేఖ‌
టీటీడీపీలోంచి ఇత‌ర పార్టీలలోకి జంపింగ్‌లు కొన‌సాగుతున్నాయి. టీటీడీపీకి రేవంత్‌ రెడ్డి గుడ్ బై చెప్పిన త‌రువాత ఆ పార్టీ నుంచి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీగా వ‌ల‌స‌లు వెళుతోన్న విష‌యం తెలిసిందే. జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి గండ్ర స‌త్య‌నారాయ‌ణ కూడా ఈ రోజు రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడుకి పంపారు. రేపు తెలంగాణ‌ సీఎం కేసీఆర్ స‌మక్షంలో టీఆర్ఎస్‌లో గండ్ర స‌త్య‌నారాయ‌ణ చేర‌నున్నారు. దీంతో టీటీడీపీకి మ‌రో షాక్ త‌గిలింది.   
gandra satyanarayana
Telugudesam
TRS

More Telugu News