కాస్ట్ లీ ప్రేమ.. ప్రియురాలికి పాతిక ఫోన్లు బహూకరిస్తూ ప్రపోజ్ చేశాడు!
- ప్రియురాలికి 25 'ఐ ఫోన్ 10' ఫోన్లను గిఫ్ట్ చేసిన ప్రియుడు
- ఆ కాస్ట్ లీ ప్రపోజల్ కి ప్రియురాలు ఫిదా.. గ్రీన్ సిగ్నల్
- తన ప్రేమ పెళ్లికి సహకరించిన స్నేహితులకు కూడా ఐ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించిన షెన్ జెన్
- ఒక్కో ఫోన్ ఖరీదు లక్ష రూపాయల పైమాటే
తనపై కురిపించిన ప్రియుడి ప్రేమకు ఆ అమ్మాయి ఫిదా అయిపోయింది. వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో తన స్నేహితుల సమక్షంలోనే ప్రియురాలిపై ముద్దుల వర్షం కురిపించాడు. అన్నట్టు, ప్రియురాలు తనతో వివాహానికి అంగీకరించేలా చేయడంలో సహకరించిన స్నేహితులకు కూడా ఈ తరహా ఐఫోన్లను కానుకగా ఇవ్వాలని షెన్ జెన్ నిర్ణయించడం మరో విశేషం.