180 డిగ్రీల కోణంలో తలను వెనక్కి తిప్పేస్తున్న యువకుడు...వీడియో చూడండి!

  • అవలీలగా తలను వెనక్కి తిప్పుతున్న యువకుడు
  • హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో నేర్చుకున్నాడట 
  • హాలీవుడ్ హారర్ సినిమాల్లో నటించాలని ఉందంటున్న సమీర్
పాకిస్థాన్‌ చెందిన యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. కరాచీకి చెందిన మొహమ్మద్ సమీర్ (14) అసాధారణ అద్భుతాన్ని అవలీలగా చేసేస్తున్నాడు. ఎవరైనా సరే తలను భుజాలవరకు తిప్పడం సర్వసాధారణం, అంతకంటే ఏమాత్రం ముందుకు తలను తిప్పడం సాధ్యపడదు. అయితే మొహమ్మద్ సమీర్ మాత్రం గుడ్లగూబలా తన తలను 180 డిగ్రీల కోణంలో అవలీలగా వెనక్కి తిప్పేస్తున్నాడు. దీనిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఒక హాలీవుడ్ సినిమాలో నటుడు తన తలను 180 డిగ్రీల కోణంలో వెనక్కి తిప్పేశాడని, అది చూసినప్పటి నుంచీ తలను వెనక్కి తిప్పడం సాధన చేశానని తెలిపాడు. ఈ టాలెంట్ తో హాలీవుడ్ హారర్ సినిమాల్లో నటించాలని భావిస్తున్నానని సమీర్ చెబుతున్నాడు. సమీర్ టాలెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు చూడండి. 
Go Back to Shorts
pakistani
mohammad sameer
owel

More Telugu News