raghu veera reddy: రేపు ఒంగోలులో దళిత స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నాం: ర‌ఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ద‌ళితుల సంక్షేమం, అభివృద్ధికి ఇందిర‌మ్మ దార్శనిక‌త-భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ అనే అంశంపై ఈ నెల 11న ఒంగోలులో ద‌ళిత స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఇందిర‌మ్మ శ‌త జ‌యంతిని (న‌వంబ‌రు 19, 2017) స్మరించుకోవ‌డ‌మే కాకుండా నేటి త‌రం కోసం ఆమె చేసిన కృషిని గుర్తు చేయ‌డ‌మే పార్టీ బాధ్య‌త‌గా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. 'ఇందిర‌మ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం' పేరిట మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగానే ద‌ళిత స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.  
Go Back to Shorts
raghu veera reddy
Congress
apcc

More Telugu News