'మోదీ టెంట్' అద్భుతంగా ఉంది...రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఉంది: విద్యాబాలన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మోదీ టెంట్' అద్భుతంగా ఉంది...రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఉంది: విద్యాబాలన్

  • మోదీ టెంట్ లో విద్యాబాలన్ కు బస కల్పించిన గుజరాత్ పర్యాటక శాఖ
  • రెండు బెడ్ రూంలు కలిగిన ఆ బుల్లెట్ ప్రూఫ్ టెంట్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయి
  • టెంట్ లో ఉన్నంతసేపూ రాజభోగాలు అనుభవిస్తున్నట్టు అనిపించింది
గుజరాత్ లో తనకు కేటాయించిన టెంట్ అద్భుతంగా ఉందని, రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపింది. విద్యాబాలన్ ప్రస్తుతం 'తుమార్హీ సులు' సినిమాలో నటిస్తోంది. లేట్ నైట్ ఆర్జే పాత్రలో నటించిన ఆమె ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా గుజరాత్‌ వెళ్లింది.

ఈ సందర్భంగా గుజరాత్‌ పర్యాటక శాఖ ఆమెకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా అన్ని సౌకర్యాలు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ టెంట్ ను ఆమెకు కేటాయించారు. ఇందులో సోఫా, టీవీ, మల్టీమీడియా ప్లేయర్లు, రెండు బెడ్‌ రూంలు ఉన్నాయి. వాస్తవానికి ఈ టెంట్ ను ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కేటాయిస్తారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ‘ఆ టెంట్‌ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఉన్నంతసేపూ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు అనిపించింది’ అని చెప్పింది. కాగా, ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
vidya balan
tumhari sulu
movie
Gujarath
modi tent

More Telugu News