బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కు యువతి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు!
- వరుణ్ ధావన్ కు ప్రతిరోజూ మెసేజ్ లతో యువతి వేధింపులు
- పద్దతి మార్చుకోవాలని హెచ్చరించి, నెంబర్ బ్లాక్ చేసిన వరుణ్
- సమాధానమివ్వకపోతే ఆమె ఆత్మహత్యచేసుకుంటుందంటూ మరో వ్యక్తి బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వరుణ్
అయినా ఆమె పట్టించుకోకపోవడంతో ఆమె ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేశాడు. ఆ తరువాత మరోవ్యక్తి ఫోన్ చేసి, ఆమె మెసేజ్ లకు సమాధానం ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటుందని హెచ్చరించాడు. దీంతో ఆలస్యం చేస్తే ప్రమాదకరమని భావించిన వరుణ్ ధావన్.. శాంతాక్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో త్వరలో ఆమె వివరాలు కనుక్కుని కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. కాగా, ప్రస్తుతం వరుణ్ ‘అక్టోబర్’, ‘సూయి ధాగా’ చిత్రాల్లో నటిస్తున్నాడు.