రేవంత్ కు ఎడమ చేత్తో స్వీట్ తినిపించిన రాహుల్.. నెటిజన్ల కామెంట్లు!

  • ఫేస్ బుక్ లో ఫొటో పెట్టిన రేవంత్
  • ఎడమ చేత్తో స్వీట్ తినిపించడంపై నెటిజన్ల స్పందన
  • మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించలేదంటూ కామెంట్
టీటీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ కు రాహుల్ గాంధీ స్వీట్ తినిపించారు. ఈ ఫొటోను రేవంత్ రెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే, కుడి చేత్తో కాకుండా, ఎడమ చేత్తో రాహుల్ స్వీట్ తినిపించడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కష్టపడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు.. రాహుల్ గాంధీ ఎలాంటి బహుమతి ఇచ్చాడో చూడండి అంటూ ఒక నెటిజన్ స్పందించాడు. ఎడమ చేత్తో స్వీట్ పెట్టాడంటే, మీకు హ్యాండ్ ఇచ్చినట్టే అంటూ మరొకరు స్పందించారు. ఎడమ చేత్తో స్వీట్ పెడుతున్నాడంటే అది విషంతో సమానమని, మిమ్మల్ని రాహుల్ మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించలేదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా పలువురు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. 
Go Back to Shorts
revanth reddy
congress
tTelugudesam
rahul gandhi
kuntia
utham kumar reddy

More Telugu News